Friday, March 20, 2009

వంపులు తిరిగిన నీ సుందర రూపం
గిరికోనల నడుమ వికసించిన వైనం
పచ్చని పచ్చికలో వంచిన రేఖలా
ప్రభవించిన ప్రకృతి ఆకృతి గీతలా!

పయనించేను నీపై భాటసారులు ఏందరో
గమనించేను నీసోగసులు కోందరే
నిను వీక్షించని నయనాలు వేలకువేలే
నిను గుర్తించని హ్రుదయాలు లేనేలే!!

Obviously I am referring to the road in the photo below:

Sunday, October 5, 2008

సంక్రాంతి

ఊరిమధ్యన
భోగిమంటల నెగళ్ళు
రంగు రంగుల
ముగ్గు మధ్యన గొబ్బిళ్ళు

కన్నె పిల్లల
సిగ్గు మొగ్గల లోగిళ్ళు
కోరి మరదలితో
సరసాలాడే కొత్త అల్లుళ్ళు

హరిలో రంగ హరియని
హరిదాసుల చిడతల చప్పుళ్ళు
అమ్మమ్మలు చేసిన అప్పచ్చులతో
నిండిన చిన్నారుల గుప్పిళ్ళు

"నవ"ధాన్యాలతో
కళ కళ లాడే అంగళ్ళు
కొత్త బియ్యము
పొంగించి చేసిన పొంగళ్ళు

పసి బిడ్డలకు
భొగిపళ్ళ కొలువుదీరు ఉత్సవాలు
రైతుబిడ్డలకు
భోగభాగ్యాల ఆనందోత్సాహాలు

విను వీధిన విహంగమల్లే విహరించే
గాలి పటాలు
కొత్త బంగారు లోకానికి తెరిచే
తొలి కవాటాలు

ఇవీ ఆనాటి ఆ సంక్రాంతి సంబరాలు..

కాని,
ఇప్పుడేవీ
ఆ భోగ భాగ్యాలు,
ఇప్పుడేవీ
ఆ చిరునెగళ్ళ భోగి మంటలు

ఇప్పుడంతా..
కరువుకాటకాలతో రోగ-అభాగ్యాలు
నిప్పులేని e-భోగిమంటలు
ఇప్పుడేవీ ఆ రంగు రంగుల ముగ్గులు
ఇప్పుడంతా కళాకంతులు లేని e-ముగ్గులు
స్వచ్చత లేని కృత్రిమమౌ e-సిగ్గులు
గాలి లెకుండానే e-గగనాన
ఎగిరే e-గాలిపటాలు

అయినా కొరతేమీ లేదు నేస్తం,

ఆ సంక్రాంతి పోయింది...
e-సంక్రాంతి వచ్చింది...

ఆత్మీయుల సమాగమం తో అలరారెను
ఆ సంక్రాంతి
e-మిత్రుల పలకరింపులతో సందడి చేసెను
e-సంక్రాంతి

ఆ సంక్రాంతి అయినా..
e-సంక్రాంతి అయినా..
సంతోషమొక్కటే
సంబరమొక్కటే

ఎక్కడ ఉన్నా.. ఎలా ఉన్నా
e-స్నేహితులతో ..
e-తరం మనుషులతో జరుపుకుంటున్న
ఈ సంక్రాంతి...అదే e-సంక్రాంతి
కావాలి అందరిని మురిపించే
ఆ తరం సంక్రాంతి..
తేవాలి మనందరిలో
సరి కొత్త క్రాంతి !!!

-Anonymous

మౌనం

శశి రాక కోసం
నిశి రాతిరి వేళ
కనులు కాయలు కాచిన
కలువ బాల విరహగీతం - మౌనం

నులివెచ్చని కిరణానికి
తొలి సంధ్య వేళ
మౄదు రేకు విచ్చిన
కమల కన్నె దరహాస గీతం - మౌనం

ఎల కోయిలను పిలవాలని
నవ వసంత వేళ
తొలి చిగురు తొడిగిన
లేత మావి కొమ్మ స్వాగత గీతం - మౌనం

సెలయేటి అలల పై
నిండు పున్నమి వేళ
తనివార తేలియాడే
చిరు తెమ్మెర తేట గీతం - మౌనం

కొండ కోనల తిరిగి
కర్షకుల కలలు పండించి
కడలి ఓడిలో సేద తీరే
నదీమతల్లి సంగమ గీతం - మౌనం

ప్రతి కదలికలో
ప్రతి కవళికలో
ప్రతిఫలించే సౌందర్యం
ప్రకృతి కాంత పరవశ గీతం - మౌనం

- Anonymous

Saturday, October 4, 2008

12.
ఏంగిలి ఆకులో మేతుకుల వేటలో ఓకరు
ఇంగ్లీసు పబ్బులో బీరు మత్తులో ఇంకోకరు,
చలిలో ఇల్లు లేని వైనం ఓక చోట
గదిలోనే మందు మైకం ఇంకోక చోట,
అన్నిటికి సాక్ష్యం నా మౌనం
ఆ మౌనం లో పోంగింది ఈ కవిత్వం.
11.
త్వరగా తినవే తల్లి
తిన్నాక వేసుకో కిళ్లి
మీ ఆయన వస్తే చేస్తాడు నీ పెళ్లి
అప్పుడు ఏడుస్తావ మళ్లి
10.
కారు మబ్బుల చీకటిలొ కాంతి వంతమైన మెరుపు లాంటి కాంత
నా మతి భ్రమించి మైమరపు తో నా హృదయం ఊగిసలాట
ఎచటనో చిక్కుకున్న తలపు నాలో కించిత్ నొప్పిని కలిగిస్తూ ఆర్త
నా వివెకము మాత్రము నన్ను ఈ లొకమునకు తిరిగి రమ్మని రోత.
9.
విధి నన్ను చూసి వెక్కిరిస్తుందా?
మది లో మౌనం పెదవి విప్పుతుందా?
శ్వాసలోని అశారాగం మూగబోయిందా?
తామస శంకెళ్లను తెంచి నా మనస్సు విహంగమై ఎగురుతుందా??????
8.
ధరణీసుర జన్యమా ఆ మెరుపు శకలం
మది లోయలో కదిలే ఉత్ప్రేరకా గీతం
పద పదమని పదనిసలాడే ఎద కోసం
చిరు నవ్వులు జల్లుతు, వాలు చూపులు నన్ను చేసె మోసం!!!
7.
తప్పుని సరిదిద్దకపోవటం కూడా తప్పే
తప్పుని సహించటం కూడా తప్పే
తప్పని తెలిసి తలవంచుకోవటం కూడా తప్పే
తప్పనిసరి అని తేలిసి కూడా తెల్లబోవటం తప్పే
6.
చైతన్యం తేవాలి, జాగృతి రావాలి
నా ఈ తల్లిని రక్షించాలి
రాక్షసుల అరాచకం, కీచకుల అమానుషం
భూతాల భీభత్సం, ప్రేతాల పాప కార్యం
జయించు అన్నిటిని రక్షించు నీ తల్లిని
చూపించు దారిని, మ్రోగించు విజయభేరిని
5.
తినటానికి కూడా కాళి లేని ఉద్యోగం
సంపాదించి ఏమి చేస్తావ ఈ సద్యోగం
జీవితం అంటే కాదు ఆర్జించటం
కుమిలిపోవటం కాదు ఈ జీవితం
4.
చూపించు చూపించు
లోకాన్ని అంతా ఆవహించు
మోహించు మోహించు
ప్రకృతిని మోహించు
3.
ముయ్యలేరు నా నొరు
ఆపలేరు నన్నెవరూ
చూడలేరు మీరు ఎవ్వరూ
నా ఈ భావజాల సేలయేరు
2. రగులుతున్న నిప్పుల నుండి జాలువారిన ఈ కవిత
మండుతున్న మనసు లొని బాధల జాబిత
మరువలేకున్న నా విషాద ముళ్ల చరిత
తేంచుకుని వస్తోంది నా నుండి ఈ చరమగీత
1. పరుగులు పెడుతున్న వయసు
నిలువునా దహిస్తున్న నా మనసు
చేయలేకున్న ఈ తపస్సు
వంచక తప్పదు నా శిరస్సు !!